రైస్ పుల్లింగ్ పేరుతో మోసం... 18 మంది ముఠా అరెస్ట్ - అనంతపురంలో రైస్ పుల్లింగ్ ముఠా అరెస్ట్
రాగి చెంబుకు అద్వితీయ శక్తులు ఉన్నాయంటూ మోసానికి పాల్పడుతోన్న రైస్ పుల్లింగ్ ముఠాను అనంతపురం జిల్లా గోరంట్ల పోలీసులు పట్టుకున్నారు. 18 మందిని అరెస్ట్ చేసి.. నిందితుల నుంచి నాలుగు కార్లు, రూ.30 వేలు, రెండు రాగి చెంబులను స్వాధీనం చేసుకున్నారు.
రాగి చెంబులకు శక్తులు ఉన్నాయంటూ మోసానికి పాల్పడుతోన్న 18 మంది రైస్ పుల్లింగ్ ముఠాను అనంతపురం జిల్లా గోరంట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నాలుగు కార్లు, రెండు రాగి చెంబులు, రూ.30 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ తెలిపారు. రసాయనాలు పూసిన రాగి చెంబులపై తక్కువ ఛార్జింగ్ ఉన్న టార్చ్ లైట్ వేసి వెలుగులు తగ్గిపోవడాన్ని చూపిస్తూ.... చెంబుకు మహిమలు ఉన్నాయని ప్రజలను మోసానికి గురి చేస్తున్నట్లు వివరించారు. అరెస్ట్ చేసిన నిందితులను కోర్టులో హాజరుపరచగా కోర్టు వారికి రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:రైస్ పుల్లింగ్ ముఠా గుట్టు ఇలా రట్టు చేశారు
TAGGED:
రైస్ పుల్లింగ్ ముఠా అరెస్ట్