ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెవెన్యూ అధికారుల నిర్వాకం..చనిపోయిన వారికి ఇళ్లు - అనంతపురం జిల్లాలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం తాజా వార్తలు

పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఒకవైపు పేదల భూములు లాక్కుంటుంటే.. మరోవైపు అనర్హులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఘటన అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించడంతోపాటు అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తుంది.

ananthapuram revenue officers
అనంతపురం జిల్లాలో రెవెన్యూ అధికారిణిని నిలదీస్తున్న గ్రామస్థలు

By

Published : Mar 6, 2020, 12:01 PM IST

అనంతపురం జిల్లాలో రెవెన్యూ అధికారిణిని నిలదీస్తున్న గ్రామస్థలు

పేదలకు ఇంటి స్థలాలను ఇచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన పథకం పలు విమర్శలను ఎదుర్కొంటోంది. ఇళ్ల స్థలాల సేకరణలో భాగంగా పేదల నుంచి భూములు లాక్కోవటం, అర్హులకు కాకుండా అనర్హులకు ఇంటి స్థలాలను మంజూరు చేయటం వంటి ఆరోపణలు ప్రతిచోట వినిపిస్తూనే ఉన్నాయి. అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో ఉగాది పండుగకు నిరుపేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే వాలంటీర్లు ఎంపిక చేసిన అర్హులకు ఇంటి స్థలాలు ఇవ్వకపోగా.. చనిపోయిన వారికి ఇంటి స్థలాలను కేటాయించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తాము ఎంపిక చేసిన అర్హులకు ఇంటి స్థలాలు ఇవ్వకపోతే ఎలా ప్రజల్లోకి వెళ్లాలని వాలంటీర్లు తహసీల్దార్​ను ప్రశ్నించారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిన వారి పేర్లు కూడా ఇంటి పట్టాల అర్హుల జాబితాలో ఉన్నాయని వాలంటీర్లు, వైకాపా నేతలు మండిపడ్డారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details