ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Bopparaju: 'ఉద్యోగుల్ని సస్పెండ్ చేయడంలో కలెక్టర్ల అత్యుత్సాహం' - Revenue employees state President Venkateswarlu news

రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులు పని భారం, మానసిక ఒత్తిడితో సతమతం అవుతున్నారని రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల్ని సస్పెండ్ చేయడంలో కొందరు కలెక్టర్లు అత్యుత్సాహం చూపుతున్నారని ఆయన మండిపడ్డారు.

'ఉద్యోగుల్ని సస్పెండ్ చేయడంలో కలెక్టర్ల అత్యుత్సాహం'
'ఉద్యోగుల్ని సస్పెండ్ చేయడంలో కలెక్టర్ల అత్యుత్సాహం'

By

Published : Sep 27, 2021, 5:54 PM IST

'ఉద్యోగుల్ని సస్పెండ్ చేయడంలో కలెక్టర్ల అత్యుత్సాహం'

రెవెన్యూ ఉద్యోగుల్ని సస్పెండ్ చేయడంలో కొందరు కలెక్టర్లు అత్యుత్సాహం చూపుతున్నారని రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. కనీసం విచారణ లేకుండా సస్పెండ్​ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులు పని భారం, మానసిక ఒత్తిడితో సతమతం అవుతున్నారని..సస్పెన్షన్ చేయడం వల్ల ఎవరికీ ఉపయోగమని ప్రశ్నించారు. కలెక్టర్లు వీలైతే ఉద్యోగుల్లో మార్పు తీసుకురావాలని సూచించారు.

"ఉద్యోగుల్ని సస్పెండ్ చేయడంలో కలెక్టర్లు అత్యుత్సాహం చూపుతున్నారు. కనీసం విచారణ లేకుండా సస్పెన్షన్ చేస్తున్నారు. ఉద్యోగులు పనిభారం, మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నారు. ఇది సమంజసం కాదు. కలెక్టర్లు వీలైతే ఉద్యోగుల్లో మార్పు తీసుకురావాలి." -బొప్పరాజు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details