అక్రమంగా నిల్వ ఉంచిన 600 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. తమకు అందిన సమాచారం ప్రకారం అనంతపురం బస్టాండ్ సమీపంలోని ఓ గోడౌన్లో.. మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సై సాగర్, తహసీల్దార్ లక్ష్మీనారాయణ తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బియ్యం నిల్వ ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలకు చెందాల్సిన బియ్యాన్ని ఇలా పక్కదారి పట్టిస్తే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ స్పష్టం చేశారు. గిడ్డంగి నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పేదలకు అందిస్తున్న బియ్యాన్ని అమ్మాలని చూస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.