Revanth reddy hath se haath jodo yatra : తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. రానున్న ఎన్నికలకు పార్టీ శ్రేణులను సర్వ సన్నద్ధం చేయడంలో భాగంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి,. మేడారం సమ్మక్క సారలమ్మల సన్నిధి నుంచి నేడు హాథ్ సే హాథ్ జోడో యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి రేవంత్.. ముందుగా ములుగు జిల్లా గట్టమ్మ, సాయిబాబా ఆలయాల్లో పూజలు చేస్తారు. అక్కడి నుంచి మేడారానికి చేరుకుని వనదేవతలను దర్శించి.. దీవెనలు తీసుకుని మధ్యాహ్నం 12 గంటల నుంచి యాత్ర మొదలు పెడతారు.
hath se haath jodo yatra in telangana : కొత్తూరు, నార్లాపూర్ గోవిందరావుపేట ప్రాజెక్ట్ నగర్ అక్కడినుంచి పస్రా వరకూ వచ్చి అక్కడి కూడలిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం.. గోవిందరావుపేట, చల్వాయి, మచ్చాపూర్, వెంకటాపూర్ మండలం జవహర్ నగర్, ములుగు జిల్లా జంగాలపల్లి క్రాస్, ఇంచర్ల, వెంకటాపూర్ క్రాస్ మీదుగా పాలంపేట చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి...రేపు తిరిగి యాత్రను ప్రారంభిస్తారు. రెండు రోజుల పాటు.. ములుగు జిల్లాలోనే రేవంత్ రెడ్డి యాత్ర కొనసాగుతుంది.
రేవంత్ రెడ్డి యాత్ర ఇలా కొనసాగనుంది..
- ఉదయం 8 గంటలకు రేవంత్‌రెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరి వరంగల్ హైవే మీదుగా ములుగు చేరుకుంటారు.
- అక్కడ గట్టమ్మ, సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. ఉదయం 11 గంటలకు మేడారం సమ్మక్క సారలమ్మల వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు.
- మధ్యాహ్నం 12 గంటలకు పాదయాత్ర ప్రారంభించనున్నారు. మేడారం నుంచి కొత్తూరు, నార్లాపూర్, ప్రాజెక్ట్ నగర్ వరకు పాదయాత్ర కొనసాగుతుంది.
- ప్రాజెక్ట్ నగర్‌లో భోజన విరామం అనంతరం 2.30 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభమవుతుంది.
- సాయంత్రం 4.30 గంటల నుంచి 5 గంటలకు పస్రా గ్రామంలో టీ విరామం తర్వాత పస్రా కూడలిలో సమావేశం నిర్వహిస్తారు.
- అక్కడి నుంచి రాత్రి 8 గంటలకు రామప్ప గ్రామానికి చేరుకుని రాత్రికి రేవంత్‌రెడ్డి అక్కడే బస చేస్తారు.