ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీస్​ 'సుల్తాన్​'కు రిటైర్మెంట్.. వేడుకగా వీడ్కోలు - పోలీస్ డాగ్​ సుల్తాన్​కు రిటైర్మెంట్ వార్తలు

జీవితంలో ఉద్యోగం చేసే ప్రతి వ్యక్తికి 60 ఏళ్లు దాటితే పదవి వీరమణ చేస్తారు. రిటైర్మెంట్​ వేడుక ఘనంగా నిర్వహిస్తారు. అయితే పోలీసు విభాగంలోని ఓ జాగిలానికి సైతం.. పదవీ విరమణ వేడుకను ఘనంగా నిర్వహించారు.

పోలీస్​ 'సుల్తాన్​'కు రిటైర్మెంట్.. వేడుకగా వీడ్కోలు
పోలీస్​ 'సుల్తాన్​'కు రిటైర్మెంట్.. వేడుకగా వీడ్కోలు

By

Published : Apr 1, 2021, 6:57 PM IST

పోలీస్​ 'సుల్తాన్​'కు రిటైర్మెంట్.. వేడుకగా వీడ్కోలు

ఉద్యోగం చేసే ప్రతి వ్యక్తికి పదవీ విరమణ వేడక ఘనంగా చేస్తారు. అనంతపురం జిల్లాలోనూ ఇలా రిటైర్ అయిన ఓ ఉద్యోగికి ఘనంగా వీడ్కోలు పలికారు. అయితే.. ఇక్కడ వీడ్కోలు పలికింది.. పోలీసు శాఖలోని జాగిలానికి.

పోలీసులకు నిత్యం తోడుంటూ క్రిమినల్స్‌ను పట్టించడమే కాక.. అనేక కేసులు చేధించడానికి ఉపయోగపడిన జాగిలానికి... గుంతకల్లు రైల్వే పోలీసులు పదవి విరమణ వేడుక చేశారు. రైల్వే రక్షక దళంలో 11 సంవత్సరాలుగా బాంబ్‌ స్క్వాడ్‌, ట్రైన్‌ తనిఖీలు వంటి ఎన్నో సేవలందించిన 'సుల్తాన్'‌ అనే శునకానికి గౌరవంగా వీడ్కోలు పలికారు. పూలమాలతో అలంకరించి... శాలువతో సత్కరించారు. అనంతరం బాణా సంచా కాల్చి సంబరాలు చేశారు. సుల్తాన్ ను జంతు సంరక్షణ శాలకు తరలించనున్నట్టు అధికారులు వెల్లడించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details