ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మెల్యే కక్ష కట్టి.. నా భవనాన్ని కూల్చివేశారు: విశ్రాంత ఏఎస్పీ - నేటి తెలుగు వార్తలు

Retired ASP: అవినీతి ఆరోపణలపై సీఎంకు లేఖ రాసినందుకు విశ్రాంత ఏఎస్పీ బాలనర్సింహారెడ్డి భవనాన్ని అధికారులు కూల్చివేశారు. ఎమ్మెల్యే కక్ష గట్టి తన భవనాన్ని కూల్చివేశారని ఆయన ఆరోపించారు.

demolition
కూల్చివేత

By

Published : Nov 21, 2022, 9:44 PM IST

Retired ASP Balanarsimha Reddy: అనంతపురంలో మాజీ ఏఎస్పీ బాలనర్సింహారెడ్డి భవనాన్ని అధికారులు కూల్చివేశారు. ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కక్షతోనే తన భవనాన్ని కూల్చివేశారని బాలనర్సింహారెడ్డి ఆరోపిస్తున్నారు. రహదారి విస్తరణలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని.. దానిలో స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి హస్తముందని సీఎం జగన్​కు లేఖ రాసినందుకే ఇలా చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.

రోడ్డు విస్తరణలో భాగంగా బాలనర్సింహారెడ్డి భవనాన్ని గతంలో కొంతమేర కూల్చివేయగా.. రహదారిని ఇష్టానుసారం మార్చేశారని దీనిలో స్థానిక ఎమ్మెల్యే హస్తముందని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీఎం జగన్‌కు లేఖ రాశారు. సోమవారం పోలీసు పహారా మధ్య భారీ యంత్రాలతో ఆయన భవనాన్ని అధికారులు మరికొంత కూల్చివేశారు. ఎమ్మెల్యే కక్షగట్టి తన భవనం కూల్చివేశారని బాలనర్సింహారెడ్డి ఆరోపించారు.

విశ్రాంత ఏఎస్పీ బాలనర్సింహారెడ్డి భవనం కూల్చివేత

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details