వైద్య పరీక్షల్లో ఆలస్యం, చికిత్స అందకపోవటం వల్ల మృతి చెందిన కరోనా రోగులు ఎందరో. ఒకవైపు కొవిడ్ మరణాలు పెరుగుతుంటే.. మరోవైపు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో టెస్టులు నిలిపేశారు. దీంతో వైద్య పరీక్షల కోసం వచ్చేవారి పరిస్థితి దయనీయంగా మారింది. విషయం తెలియక వచ్చిన వారిని ఆస్పత్రి గేటు వద్ద నుంచే పంపించేస్తున్నారు. భయాందోళనకు గురవుతూ అక్కడి నుంచి వెనుదిరుగుతున్నారు. కరోనా పరీక్షల కోసం వచ్చిన వారితో గందరగోళంగా ఉండే ఆస్పత్రి.. ఖాళీగా దర్శనమిస్తోంది. ఆస్పత్రి ప్రాంగణంలో ఈ రోజుక ఏర్పాటు చేసిన ప్రైవేట్ టెస్టు సెంటర్లో ఆరుగురు మృతి చెందినట్లు సిబ్బంది తెలిపారు. జిల్లా యంత్రాంగం స్పందించి.. చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ టెస్టులు నిలుపుదల
కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న వేళ.. లక్షణాలున్న ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. టెస్టింగ్ సెంటర్లలో జనం బారులు తీరుతున్నారు. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ పరీక్షలు ఆపేశారు. దీంతో ప్రజలు వెనుతిరగాల్సి వస్తోంది.
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి