'ఈటీవీ భారత్' కథనానికి స్పందన... గార్మెంట్స్ కార్మికులకు చేయూత - rayadurgam lock down latest news
లాక్డౌన్ కారణంగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో వేలాదిమంది కార్మికులు ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి సమస్యలపై 'ఈటీవీ భారత్'లో వచ్చిన కథనానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.
అనంతపురం జిల్లా రాయదుర్గంలో లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న కార్మికుల సమస్యలపై 'ఈటీవీ భారత్'లో వచ్చిన కథనానికి ప్రజల నుంచి స్పందన లభించింది. పనులు లేక పస్తులుంటున్న గార్మెంట్స్ కార్మికుల అవస్థలను చూసి పలువురు దాతలు ముందుకొచ్చారు. 'ఈటీవీ భారత్' ఆధ్వర్యంలో రాయదుర్గం కిరాణా అసోసియేషన్ సభ్యులు మహిళా గార్మెంట్స్ కార్మికులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. వాటితో పాటు పదిమంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.200 చొప్పున నగదు అందజేశారు. వారి కష్టాలు చూసి స్పందించిన 'ఈటీవీ భారత్'కి కార్మికులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిత్యావసర సరకులు పంపిణీ చేసిన రాయదుర్గం కిరాణా అసోసియేషన్ సభ్యులకు తాము రుణపడి ఉంటామని చెప్పారు.