అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వై.రాంపురంలో వాలంటీర్ దాడి చేశాడంటూ ఎస్సీ కాలనీ వాసులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమకు రావాల్సిన సరకులు అన్నీ ఇవ్వకుండా కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేయడంపై ప్రశ్నించగా.. వాలంటీర్ మహేశ్ దాడికి పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. కులం పేరుతో దూషించడమే కాకుండా చెప్పులతో దాడి చేశాడని ఆరోపించారు. నిందితుడిపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని బాధితులు, ఎస్సీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
వాలంటీర్ దాడి చేశాడంటూ.. ఎస్సీ కాలనీ వాసుల ఫిర్యాదు - ananthapuram district newsupdates
ఉరవకొండ మండలం వై.రాంపురంలో తమకు రావాల్సిన సరకులు అన్నీ ఇవ్వకుండా కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేయడంపై ప్రశ్నిస్తే.. వాలంటీరు దాడి చేశారని ఎస్సీ కాలనీ వాసులు ఆరోపించారు. దాడి చేసిన వాలంటీర్‌పై ఎస్సీ కాలనీ వాసులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వాలంటీర్ దాడి చేశాడంటూ.. ఎస్సీ కాలనీ వాసులు ఫిర్యాదు