Republic day Celebrations at Kalyana Mandapam: పెళ్లి మంత్రాలు ప్రారంభించడానికి అయిదు నిమిషాల ముందు ఓ రెండు యువ జంటలు జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నాయి. కల్యాణ మండపంలో పెళ్లి దుస్తుల్లోనే మువ్వన్నెల జెండాను ఎగురవేసి పెళ్లి రోజును మధుర జ్ఞాపకంగా మలుచుకున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ పట్టణంలోని మహాలక్ష్మివాడకు చెందిన గండ్రత్ రేఖ(1వ వార్డు కౌన్సిలర్), కేశవ్ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మహేందర్‌కు భవానితో, చిన్నకుమారుడు నరేందర్‌కు సౌమ్యతో గురువారం వివాహం జరిపించడానికి నిశ్చయించారు. గణతంత్ర దినోత్సవం కావడంతో మండపం ఆవరణలోనే పతాకావిష్కరణకు ఏర్పాట్లు చేశారు. ఇద్దరు వధువులు మండపానికి రాగానే వారు జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు. ఆ తర్వాతే పెళ్లి పీటలెక్కారు.