అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం చామాలగొంది చెరువుకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చెరువు కట్ట దెబ్బతిని నీరు వృథా అవుతోంది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు అప్రమత్తమై చెరువుకు మరమ్మతులు చేపట్టారు. వర్షాల కారణంగా కోతకు గురైన చెరువు కట్టలను బాగు చేసేందుకు అధికార యంత్రాంగం ముందుకు రావడంపై గ్రామస్థులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చామాలగొందిలో చెరువుకు కోత..మరమ్మతులు చేపట్టిన అధికారులు - Anantapur District Authority Repairs to ponds
భారీ వర్షాలకు గాండ్లపెంట మండలం చామాలగొంది చెరువు కోతకు గురైంది. కట్ట దెబ్బతిని నీరు వృథా అవుతుండటం వల్ల అధికారులు బాగు చేసే పనిలో పడ్డారు. దీనిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చెరువుకు మరమ్మతు