ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్లాక్​మార్కెట్​లో రెమ్​డెసివర్ ఇంజక్షన్లు.. 11మంది అరెస్ట్ - remdesiver injections are sold out in black market

అనంతపురంలో రెమ్​డెసివర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్​కు తరలించిన 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 16 రెమ్​డెసివర్ ఇంజక్షన్లు, రూ.94 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వీరరాఘవ రెడ్డి హెచ్చరించారు.

remdesiver injections seized
remdesiver injections seized

By

Published : May 11, 2021, 1:22 AM IST

కరోనా బాధితులకు ఇవ్వాల్సిన రెమ్​డెసివర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్​కు తరలించిన 11 మందిని.. అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 16 రెమ్​డెసీవర్ ఇంజక్షన్లు, రూ.94 వేల నగదు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

అనంతపురం సూపర్ స్పెషాలిటీలో ఏంఏన్ఓలుగా పనిచేస్తున్న నలుగురిని మొదట అరెస్ట్ చేశామని అనంతపురం డీఎస్పీ వీరరాఘవ రెడ్డి తెలిపారు. వీరి నుంచి 16 రెమ్​డెసివర్ ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీరితో పాటు జిల్లా సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న ఇద్దరు మహిళలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు చేస్తున్న మరికొందరిని అరెస్టు చేశారు. వీరంతా కలిసి కరోనా సమయంలో డబ్బు సంపాదించాలని రెమ్​డెసివర్ అక్రమాలకు తెర లేపి దుర్వినియోగం చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. అధిక ధరలకు అమ్ముకున్నట్లు విచారణలో తెలిందన్నారు. ఈ రెండు కేసుల్లో ప్రమేయం ఉన్న ఔట్​సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాలని ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. అందరిని రిమాండ్​కు పంపామన్నారు. ఆసుపత్రిలో కరోనా సమయంలో రెమిడెసివర్ ఇంజెక్షన్లు బ్లాక్ మార్కెట్​కు తరలించి అక్రమాలకు పాల్పడాలని చూస్తే చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు.

ఇదీ చదవండి:

ఆస్పత్రుల్లో జనాలు.. ఆటవిడుపులో నేతలు!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details