అనంతపురం జిల్లా హిందూపురంలో రిమాండ్ ఖైదీ అనారోగ్యంతో హఠాన్మరణం పొందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి మండలానికి చెందిన చోరీ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న దుర్గ అనే వ్యక్తిని.. కేసు వాయిదా నిమిత్తం పోలీసులు హిందూపురం కోర్టులో హాజరుపరిచారు. అక్కడి నుంచి అనంతపురం సబ్ జైలుకు తరలించేందుకు ఆర్టీసీ బస్టాడుకు చేరుకున్నారు. అక్కడ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురైన దుర్గ.. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అతడు అనేక దొంగతనాల్లో నిందితుడని పోలీసులు తెలిపారు.
రిమాండ్ ఖైదీకి అస్వస్థత.. చికిత్స పొందుతూ మృతి - Remand prisoner death News
రిమాండ్లో ఉన్న ఖైదీ తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో జరిగింది.
తీవ్ర అస్వస్థతకు గురై రిమాండ్ ఖైదీ మృతి