అనంతపురం జిల్లా కదిరిలో తాగునీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులు రిలే దీక్ష చేపట్టారు. వైకాపా అధికారంలోకి వచ్చాక తమ ఉద్యోగాలను తొలగించారని ఆరోపించారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ ఒప్పంద కార్మికుల జీవితాలతో ఆడుకోవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని, ఉద్యోగ భద్రతతో పాటు పీఎఫ్ సదుపాయాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగ భద్రత కోసం ఒప్పంద కార్మికుల రిలే దీక్ష - దీక్షలు కొనసాగిస్తామని స్పష్టం
కదిరిలో ఒప్పంద కార్మికులు రిలే దీక్ష చేపట్టారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ తమను విధుల నుంచి తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఒప్పంద కార్మకుల రిలే దీక్ష