ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు విచిత్ర వేషధారణతో గ్రామీణ ప్రాంత ప్రజల్లో కొవిడ్ పై అవగాహన కల్పించే ప్రయత్నం చేపట్టారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ.. కరోనా వైరస్ వేషధారణతో.. వారపు సంతల్లో తిరుగుతూ.. విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అందరినీ ఆకట్టుకునే విధంగా ప్రదర్శన నిర్వహిస్తూ.. కొవిడ్ పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు, మాస్కు ప్రాధాన్యం, సామాజిక దూరం వంటి విషయాలను వివరించారు. ఆర్డీటీ రీజినల్ డైరెక్టర్ లక్ష్మణరావు, ఏటీఎల్ జయచంద్రరెడ్డిలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
కొవిడ్‌పై అవగాహన..కరోనా వేషధారణలో ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ ప్రచారం - anantapuram district RDT charity news
ముళ్లును ముళ్లుతోనే తియ్యాలి అన్న చందంగా.. కరోనా వేషధారణతోనే.. కొవిడ్‌పై అవగాహన కల్పిస్తోంది అనంతపురానికి చెందిన ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ. వారపు సంతల్లో తిరుగుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కరోనా నివారణకు పాటించాల్సిన నియమాలను ప్రజలకు వివరిస్తున్నారు.
ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ విచిత్ర ప్రచారం
ఇవీ చూడండి..