కరోనాతో ఉపాధి కోల్పోయి, ఇబ్బందులు పడుతున్న కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని.. రాయలసీమ కళా వేదిక నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. అనంతపురం కలెక్టరేట్ వద్ద రాయలసీమ ప్రాంతంలోని కళాకారులు కన్నీటి దీక్ష చేపట్టారు. వివిధ రూపాల్లో కళలను ప్రదర్శిస్తూ వినూత్న నిరసన చేశారు.
రెండేళ్లపాటు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమపై ముఖ్యమంత్రి దయ చూపాలని కోరారు. కళాకారులకు పింఛన్ మంజూరు చేయించి, ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డులు, కళాకారులు కార్డులను వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.