ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాయదుర్గం వాసులకు ఈకేవైసీ కష్టాలు - adhaar ekyc news

ఆధార్ ఈ కేవైసీలింకు చేసుకోవడానికి ప్రజలకు ఇంకా అవస్థలు తప్పడం లేదు. రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పనులు కావడంలేదని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు క్యూలో ఉన్నా... అధికారులు తమ గోడు వినిపించుకోవడం లేదన్నారు.

rayadurgam people facing Adhar ekyc
రాయదుర్గం వాసులకు ఈ కేవైసీ కష్టాలు

By

Published : Dec 10, 2019, 12:47 PM IST

రాయదుర్గం వాసులకు ఈ కేవైసీ కష్టాలు
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ ప్రజలకు ఈ కేవైసీకష్టాలు ఇంకా తప్పడం లేదు. ప్రతీపనికి ఆధార్ లింకు అవసరం ఉండటం వలన ప్రజలు ఈ కేవైసీ చేయించుకునేందుకు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో మాత్రమే ఈ కేవైసీచేస్తుండడం వలన ప్రజలు ఆ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సివస్తోంది. పట్టణంతో పాటు వివిధ గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈకేవైసీ చేయించుకునేందుకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది.

సిబ్బంది నిర్లక్ష్యం

ఒక్క రోజులో పని కావడం లేదని.. రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈకేవైసీ చేయించుకునేందుకు వెళ్లిన ప్రజల పట్ల బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. సిబ్బందికి ఇష్టం వచ్చిన సమయంలో మాత్రమే నామమాత్రంగా పనిచేస్తుండటం వలన సాయంత్రం వరకు ఎదురుచూసి తిరిగి గ్రామాలకు వెళ్లాల్సివస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సర్వర్ పని చేస్తున్నప్పటికీ... నెట్​వర్క్ లేదని, సాంకేతిక సమస్యలు ఉన్నాయని ప్రజలను కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని ఆవేదన చెందుతున్నారు.ఆధార్ లింకు చేయించుకునేందుకు 10 రోజుల నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ పని కావడంలేదని వాపోతున్నారు. ప్రజలకు ఎప్పుడు రావాలో కూడా ఉద్యోగులు చెప్పకపోవడం నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని చెబుతున్నారు.

ఇదీ చదవండి :

రైతుల సమస్యలపై తెదేపా నిరసన

ABOUT THE AUTHOR

...view details