ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాయదుర్గం మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎంపిక ఏకగ్రీవం

ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, మున్సిపల్ ఛైర్​పర్సన్ పోరాళ్లు శిల్ప ఆధ్వర్యంలో.. అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపల్ కార్యాలయంలో కో ఆప్షన్ సభ్యులను ఎంపిక చేశారు. అన్ని వర్గాలకూ సమన్యాయం చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

co option members election in rayadurgam
రాయదుర్గం మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎంపిక ఏకగ్రీవం

By

Published : May 19, 2021, 7:08 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపల్ కార్యాలయంలో.. కో ఆప్షన్ సభ్యులు ఎంపిక ఏకగ్రీవమైంది. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, మున్సిపల్ ఛైర్​పర్సన్ పోరాళ్లు శిల్ప, ఇతర వార్డు సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. సామాజిక న్యాయం పాటిస్తూ.. అన్ని వర్గాల వ్యక్తులనూ పదవులకు ఎంపిక చేసినట్లు రామచంద్రారెడ్డి తెలిపారు.

ఇద చదవండి:కొవిడ్​ నుంచి కోలుకున్న 3నెలల తర్వాతే టీకా!

పదవులు దక్కిన వారిలో జనరల్, మైనారిటీలతో పాటు ఆటోడ్రైవర్ భార్య, ప్రైవేటు ఉపాధ్యాయురాలు ఉన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా, కౌన్సిలర్లు, ఇతర అధికారులు, అధికారపార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఇద చదవండి:

ఆస్పత్రులకు వెళ్తూ.. వాహనాల్లోనే మృతి చెందుతున్న బాధితులు

ABOUT THE AUTHOR

...view details