Rayadurgam MLA Kapu Ramachandra Reddy Goodbye to YSRCP: రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైఎస్సార్సీపీకి గుడ్‌బై చెప్పారు. తాడేపల్లి వచ్చి సీఎం జగన్‌తో మాట్లాడిన తనకు టికెట్ లేదని సజ్జల చెప్పారని కాపు రామచంద్రారెడ్డికి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ క్రమంలో తాడేపల్లి సీఎంవోకు సెల్యూట్ చేసి కాపు చంద్రారెడ్డి గుడ్‌బై చెప్పారు.
'మీకో దండం జగన్'- తాడేపల్లి సీఎంవోకు గుడ్‌బై చెప్పిన కాపు రామచంద్రారెడ్డి - కాపు రామచంద్రారెడ్డి
రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైఎస్సార్సీపీ(YSRCP)కి గుడ్‌బై చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కల్యాణదుర్గం నుంచి తాను, రాయదుర్గం నుంచి తన భార్య స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని తెలిపారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 5, 2024, 6:04 PM IST
|Updated : Jan 5, 2024, 7:49 PM IST
జగన్‌ను నమ్ముకుని కాంగ్రెస్ నుంచి వస్తే తమ జీవితాలు సర్వనాశనం అయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. సర్వే పేరు చెప్పి టికెట్ ఇవ్వలేమనడం బాధగా ఉందన్న ఆయన వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిపోతున్నట్లు స్పష్టంచేశారు. రాబోయే ఎన్నికల్లో కల్యాణదుర్గం నుంచి తాను, రాయదుర్గం నుంచి తన భార్య స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని తెలిపారు. నా నోటితో ఇంక వారి పేరు కూడా చెప్పాలనుకోవటం లేదంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి దండం పెట్టి తీవ్ర ఆవేదనతో తాడేపల్లి నుంచి కాపు రామ చంద్రారెడ్డి వెనుదిరిగారు.
"తాడేపల్లి వచ్చి సీఎం జగన్‌తో మాట్లాడిన నాకు టికెట్ లేదని సజ్జల చెప్పారు. జగన్‌ను నమ్ముకుని కాంగ్రెస్ నుంచి వస్తే తమ జీవితాలు సర్వనాశనం అయ్యాయి. సర్వే పేరు చెప్పి టికెట్ ఇవ్వలేమనడం బాధగా ఉంది. దీంతో నేను వైఎస్సార్సీపీ నుంచి నేను తప్పుకుంటున్నాను. రాబోయే ఎన్నికల్లో కల్యాణదుర్గం నుంచి నేను, రాయదుర్గం నుంచి నా భార్య స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తాం." - కాపు రామచంద్రారెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే