ఏపీఎస్ఆర్టీసీ డిపోల్లో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం డిపోల్లో కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు శ్రీనివాసులు ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఉద్యోగ భద్రత కోరుతూ... ఆర్టీసీ డిపో కార్మికుల నిరసన - రాయదుర్గం, కళ్యాణదుర్గం ఆర్టీసీ డిపో కార్మికుల నిరసన
ఉద్యోగ భద్రత కోరుతూ.. ఆర్టీసీ డిపో కార్మికులు అనంతపురంలో నిరసనకు దిగారు. రాయదుర్గం, కళ్యాణదుర్గంలో కనీస వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపించారు.
![ఉద్యోగ భద్రత కోరుతూ... ఆర్టీసీ డిపో కార్మికుల నిరసన sc, st monitoring committe member srinivasulu, rtc depot workers protest in kalyanadurgam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-03:14:43:1619171083-vlcsnap-2021-04-23-14h37m10s101-2304newsroom-1619168866-600.jpg)
ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు శ్రీనివాసులు, కళ్యాణదుర్గంలో ఆర్టీసీ డిపో కార్మికుల నిరసన
TAGGED:
rtc depot workers protests