అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అనంతపురం పోలీసులు సీజ్ చేశారు. కర్నూలు జిల్లా డోన్ నుంచి బెంగళూరుకు లారీలో బియ్యం తరలిస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టారు. 515 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 6 లక్షల 50 వేలు ఉంటుందని డీఎస్పీ వీర రాఘవ రెడ్డి అన్నారు. లారీ డ్రైవర్‌తోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితులు రఫీ, శ్రీనులపై కేసు నమోదు చేశామని.. అరెస్టు చేయాల్సి ఉందన్నారు.
515 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత - అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అనంతపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 6 లక్షల 50 వేలు ఉంటుందని డీఎస్పీ వీర రాఘవ రెడ్డి తెలిపారు.
రూ. 6 లక్షల 50 వేల విలువైన రేషన్ బియ్యం పట్టివేత