ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యథేచ్ఛగా నల్లబజారుకు తరలుతున్న రేషన్ సరుకులు - కదిరి వార్తలు

కదిరిలో పేదలకు అందాల్సిన రేషన్ సరుకులు నల్లబజారుకు తరలుతున్నాయి. చౌక ధరల దుకాణం నుంచి కందిపప్పు, పంచదార యథేచ్ఛగా పక్కదారి పడుతున్నాయి. అడ్డుకట్ట వేయాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. స్థానికులు, తెదేపా నేతల ఫిర్యాదుతో అధికారులు స్పందించారు. వివరాలు ఆరా తీస్తున్నారు.

Ration goods in black market
రేషన్ సరుకులు

By

Published : Jan 13, 2021, 4:21 PM IST

దారిద్య్ర రేఖకు దిగువనున్న పేదలకు తెల్లరేషన్ కార్డుల ద్వారా అందిస్తున్న సరుకులు పక్కదారి పడుతున్నాయి. అనంతపురం జిల్లా కదిరిలోని చౌక ధరల దుకాణం నుంచి కందిపప్పు, పంచదార నల్లబజారుకు తరలుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కదిరి పట్టణంలోని రైల్వే ట్రాక్ సమీపంలో రేషన్ సంబంధిత ఖాళీ కవర్లను పెద్దసంఖ్యలో రోడ్డు పక్కన పడేశారు. స్థానికుల ద్వారా ఫిర్యాదు అందుకున్న అధికారులు కవర్లను సేకరించారు. ఏ దుకాణం నుంచి సరుకులు నల్లబజారుకు వెళుతున్నాయో తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెదేపా నేతలు సైతం తహసీల్దార్​కు ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details