ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటివద్దకే రేషన్‌: వాహనాలను తిరిగిచ్చేసిన 10మంది ఆపరేటర్లు - Ration Supply in AP

ఇంటివద్దకే నిత్యావసరాలు పంపిణీ చేయడానికి పలుచోట్ల వాహన ఆపరేటర్లు సంసిద్ధత వ్యక్తం చేయడంలేదు. తమకు వస్తున్న డబ్బులో ఏం మిగలడంలేదని, వెట్టిచాకిరి చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా గుంతకల్లులో 20 మంది ఆపరేటర్లు ఉండగా.. వారిలో 10 మంది వాహనాలను వెనక్కి ఇచ్చేశారు.

వాహనాలను తిరిగిచ్చేసిన 10మంది ఆపరేటర్లు
వాహనాలను తిరిగిచ్చేసిన 10మంది ఆపరేటర్లు

By

Published : May 9, 2021, 12:16 PM IST

వాహనాలను తిరిగిచ్చేసిన 10మంది ఆపరేటర్లు

ఇంటివద్దకే నిత్యావసరాలు పంపిణీ చేయలేమంటూ వాహన ఆపరేటర్లు తప్పుకుంటున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో 20మంది వాహన ఆపరేటర్లలో పది మంది..తమ వాహనాలను తహసీల్దార్ కార్యాలయంలో అప్పగించారు. తమకు వస్తున్న 21 వేల రూపాయల్లో... పెట్రోలు, వాహన ఈఎంఐ, హమాలీకే సరిపోతోందని... ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సీడీ రావడం లేదని ఆపరేటర్లు వాపోతున్నారు. తమకు వచ్చే జీతంలో ఏమీ మిగలట్లేదని... తాము వెట్టిచాకిరి చేయడం తప్పా.. ప్రయోజనం లేదని అందుకే వాహనాలకు తిరిగి ఇచ్చేశామని ఆపరేటర్లు స్పష్టం చేస్తున్నారు. తాము వాహనం తీసుకునే సమయంలో... 70వేల రూపాయల వరకూ ఖర్చు పెట్టామని.. వాటిని ఇచ్చేస్తే వేరే ఉపాధి చూసుకుంటామని చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details