అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో గురువారం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి పేరువీధి వరకు గోవింద నామస్మరణ చేస్తూ ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవం జరిపారు. ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట సూర్యనారాయణ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు.
వైభవంగా శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవం - dharmavaram
శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవాన్ని గురువారం అనంతపురం జిల్లా ధర్మవరంలో వైభవంగా నిర్వహించారు. ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట సూర్యనారాయణ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
వైభవంగా శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవం