ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి - రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలంలోని ఎర్రంపల్లి, చిన్నపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి వేరుశెనగ గడ్డివాములు దగ్ధమయ్యాయి. నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి హామీ ఇచ్చారు.

MLA assured the affected farmers would be taken care
నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ

By

Published : Oct 31, 2020, 7:35 PM IST

అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలంలోని ఎర్రంపల్లి, చిన్నపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి దుండగులు వేరుశనగ గడ్డి వాములకు నిప్పు పెట్టారు. ఫలితంగా అవి పూర్తిగా కాలిపోయి తీవ్ర నష్టం వాటిల్లింది. కాలిపోయిన గడ్డి వాములను రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. బాధిత రైతులకు ఒక్కొక్కరికి 20 వేల ఆర్థిక సాయం, వైయస్సార్ జలకళ పథకం ద్వారా ఉచితంగా బోర్లు వేయిస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ పొలాల్లో కాకుండా... పంటల నూర్పిడి కోసం కళ్ళం ఏర్పాటు చేసుకోవడానికి రైతులకు స్థలం కేటాయించాలని ఆర్డీవో మధుసూదన్ కు ఎమ్మెల్యే సూచించారు.

ABOUT THE AUTHOR

...view details