Rape on Btech Student in Tadipatri :ప్రేమ పేరుతో వంచించి ఓ విద్యార్థినిపై ఒకరు అత్యాచారం చేయగా... అతడితో ఏకాంతంగా కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని బెదిరించి మరొకరులైంగిక దాడి (Sexual Assault) చేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడిపత్రి నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన విద్యార్థిని ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో బీటెక్ విద్యను అభ్యసిస్తోంది. ఈమెకు అదే మండలానికి చెందిన కృష్ణారెడ్డితో 5 నెలలుగా పరిచయం ఉండేది. అతడు ప్రేమిస్తున్నానంటూ (Love) వెంటపడేవాడు. ఆమెను నమ్మించడానికి బ్లేడుతో చేతిని కోసుకున్నాడు. దీంతో భయపడిన విద్యార్థిని అతడితో చనువుగా ఉండేది. అక్టోబరు 19న నిందితుడు కృష్ణారెడ్డి విజయవాడలో హాస్టల్లో ఉన్న యువతికి ఫోన్ చేసి బెంగళూరుకు (Bangalore) రావాలని, లేని పక్షంలో ఇద్దరి పరిచయాన్ని కుటుంబ సభ్యులకు, తెలిసిన వారికి చెబుతానని బెదిరించాడు. దీంతో ఆ యువతి 20న బెంగళూరుకు బయలు దేరింది.
విద్యార్థినిని భయపెట్టి లాడ్జికి తీసుకెళ్లాడు : అక్కడ ఆమెను నిందితుడు కృష్ణారెడ్డి తన మిత్రుడి గదికి తీసుకు వెళ్లాడు. గదిలో ఎవరూ లేనప్పుడు బెదిరించాడు. అనంతరం అత్యాచారం చేశాడు. ఇలా 4 రోజుల పాటు లైంగిక దాడి చేశాడు. అతడి బారి తప్పించుకుని ఆమె సొంతూరుకు చేరుకుంది. తిరిగి అక్టోబరు 28న కళాశాలకు వెళ్లడానికి తండ్రితో కలిసి గుత్తి వరకు వెళ్లింది. ఆమెను అక్కడ వదిలి వెనుదిరిగాడు ఆ తండ్రి. అదే సమయంలో విద్యార్థిని సెల్ ఫోనుకు గుంతకల్లు పట్టణానికి చెందిన దివాకర్ అనే వ్యక్తి ఫోన్ చేసి "బెంగళూరులో కృష్ణారెడ్డితో ఏకాంతంగా కలిసున్న వీడియోలు, ఫొటోలు నా వద్ద ఉన్నాయి.. నేను చెప్పినట్లు వినకపోతే సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేస్తా"నని బెదిరించి గుంతకల్లుకు రావాలి అన్నాడు. భయపడిన బాధితురాలైన విద్యార్థిని గుంతకల్లుకు వెళ్లగా.. ఆమెను స్థానికంగా ఓ లాడ్జికి తీసుకెళ్లాడు.