అనంతపురం జిల్లా గోరంట్ల మంటలం కరావులహపల్లిలో అర్థరాత్రి దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ఓ మహిళపై గోపాల్ అనే వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. బాధిత మహిళ కేకలు వేయటంతో కుటుంబ సభ్యులు వచ్చి నిందితుణ్ణి పట్టుకొని దాడి చేశారు. ప్రతిఘటించిన గోపాల్ వేట కొటవళ్లతో వారిపై ఎదురుదాడికి దిగాడు. దింతో బాధిత మహిళ తండ్రికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతణ్ణి ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉండగా..ఘటనపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మహిళపై అత్యాచార యత్నం... ఆపై వేట కొడవలితో దాడి - Rape attempt on woman
ఓ మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడి...ఆపై అడ్డుచ్చొని వారిపై వేట కొడవళ్లతో దాడి చేసిన ఘటన అనంతపురం జిల్లా కరావులహపల్లిలో అర్థరాత్రి చోటుచేసుకుంది. ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఆపై వేట కొడవలితో దాడి
TAGGED:
Rape attempt on woman