ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కనుల పండువగా శ్రీ రంగనాథేశ్వర స్వామి రథోత్సవం - Ranganathaswamy rathostavam in bommanahal

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రంగనాథేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, రాయదుర్గం ఎమ్యెల్యే తదితరులు పాల్గొన్నారు.

Ranganathaswamy Chariot Festival in glory
కనుల పండువగా రంగనాథస్వామి రథోత్సవం

By

Published : Mar 14, 2021, 8:32 AM IST

అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం గోవిందవాడలో ప్రసిద్ధ శ్రీ రంగనాథేశ్వర స్వామి రథోత్సవం కనుల పండువగా సాగింది. స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.

రథోత్సవానికి తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, రాయదుర్గం ఎమ్యెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై స్వామిని దర్శించుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయి.. రథోత్సవంలో పాల్గొన్నారు.

ఇదీచదవండి:

మహానందిలో కన్నులపండువగా రథోత్సవం

ABOUT THE AUTHOR

...view details