అనంతపురంలో రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకుంటున్నారు. నగరంలోని మడిమి వంక వద్ద ఉన్న చాందిని మసీద్‌లో కొవిడ్ నిబంధనల మేరకు ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని.. కరోనా మహమ్మారి అంతమవ్వాలని.. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆ దేవుణ్ని కోరుకున్నట్లు ముస్లిం సోదరులు తెలిపారు. సేవా భావానికి ప్రతీక అయినా రంజాన్ పండుగను ప్రతి ముస్లిం సంతోషంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.
అనంతలో ఘనంగా రంజాన్ వేడుకలు
పవిత్ర రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు అనంతపురంలో ఘనంగా చేసుకుంటున్నారు. కరోనా మహమ్మారి అంతమవ్వాలని ఆ దేవుణ్ని ప్రార్థించారు.
Ramzan celebrations in Ananthapuram