ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బాల్య వివాహాలకు ముగింపు పలకాలి' - విద్యార్థులు, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, వాలంటీర్ల ర్యాలీ

బాల్య వివాహాలను అరికట్టాలని ప్రజలకు అవగాహన కల్పించేందుకు విద్యార్థులు, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, వాలంటీర్లు ర్యాలీ నిర్వహించారు.

ananthapuram district
బాల్య వివాహాలకు ముగింపు పలకాలి

By

Published : Jun 3, 2020, 5:38 PM IST

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో బాల్య వివాహాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. బాల్యవివాహాలు జరుగుతున్నాయన్న సమాచారం తెలియగానే అధికారులు ఆ ప్రదేశానికి వెళ్లి వివాహాలను ఆపి, పిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. బాల్య వివాహాలకు ముగింపు పలకాలని ప్రజలకు అవగాహన కల్పించేందుకు విద్యార్థులు, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, వాలంటీర్లు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.18 సంవత్సరాలు నిండిన యువతి, 21 సంవత్సరాలు నిండిన పురుషుడు వివాహానికి అర్హులు. వీటిని ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా రెండు లక్షల జరిమానాతో పాటు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారని ర్యాలీలో ప్రజలకు అవగాహన కల్పించారు.
ఇది చదవండిచికెన్ గున్యా వ్యాక్సిన్ అభివృద్ధికి భారత్ బయోటెక్​తో ఒప్పందం

ABOUT THE AUTHOR

...view details