ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్​ఆర్సీపై వెల్లువెత్తిన నిరసనలు - anntapur nrc agitation rally

ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా కడప, అనంతపురం జిల్లాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. కేంద్రం పౌరసత్వ బిల్లును ఉపసంహరించే వరకూ తమ పోరాటం ఆగదని ముస్లిం నాయకులు స్పష్టం చేశారు.

rally against nrc in kadapa anda anntapur
ఎన్​ఆర్సీ పై వెల్లువెత్తిన నిరసనలు

By

Published : Dec 31, 2019, 6:40 PM IST

Updated : Dec 31, 2019, 6:46 PM IST

కడప జిల్లాలో...
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కడపలో ముస్లిం నాయకులు ఆందోళన చేపట్టారు. రాయలసీమ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కోటిరెడ్డి సర్కిల్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకూ ర్యాలీ నిర్వహించారు. బాబ్రీ మసీదు, గోమాంసం, త్రిపుల్ తలాఖ్ వంటి అంశాలపై తాము రోడ్డెక్కలేదన్నారు. కాళ్ల కింద ఉండే భూమిని లాగేసుకునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. కేంద్రం ఈ చట్టాన్ని ఉపసంహరించే వరకూ తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

కడపలో....

అనంతపురం జిల్లాలో..
ఎన్ఆర్సీ బిల్లుకు వ్యతిరేకంగా అనంతపురంలో ముస్లిం జేఏసీ మహిళలు నిరసన చేపట్టారు. టవర్ క్లాక్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకూ పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. పౌరసత్వ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

అనంతపురంలో...

ఇదీ చదవండి: 'ఔట్ సోర్సింగ్ కార్మికులను ఇష్టారీతిన బదిలీ చేస్తున్నారు'

Last Updated : Dec 31, 2019, 6:46 PM IST

ABOUT THE AUTHOR

...view details