లాక్ డౌన్ కారణంగా అనంతపురం జిల్లాలో చిక్కుకుపోయిన ఇతర రాష్ట్రాల వారికి అన్ని పరీక్షలు నిర్వహించిన తరువాత స్వస్థలాలకు పంపిస్తున్నామని... జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఉండిపోయిన రాజస్థాన్ వాసులను ఇవాళ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి పంపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అనంతపురం నుంచి స్వస్థలాలకు రాజస్థాన్ వాసులు - anantapuram news
లాక్డౌన్ వల్ల అనంతపురం జిల్లాలో ఉండిపోయిన రాజస్థాన్ వాసులను ప్రత్యేక బస్సుల్లో వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు.
అనంతపురం నుంచి స్వస్థలాలకు రాజస్థాన్ వాసులు