తీరని విత్తనాల కొరత.. ఆగని రైతుల ఆందోళనలు - formers
వేరుశనగ విత్తనాల పంపిణీ జాప్యంపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రొద్దం వ్యవసాయ కార్యాలయం వద్ద రైతన్నలు ఆందోళన చేపట్టారు. పెనుకొండ-పావగడ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. విత్తనాలు వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
raithulu-darna-1
అనంతపురం జిల్లాలో వేరుశనగ విత్తనాల కొరతతో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రొద్దం మండలంలో విత్తనాల సరఫరాలో జాప్యం జరుగుతుండటంపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. తాము ఎంత పోరాటం చేస్తున్నా అధికారులు స్పందిచటం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.