ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెద్దవడుగూరులో విస్తారంగా వర్షాలు.. కూలిన వంతెన - rains at anathapur district

అనంతపురం జిల్లావ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షం దాటికి వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పెద్దవడుగూరు మండలంవీరన్నపల్లి గ్రామానికి వెళ్లే రెండు రహదారుల్లో ఉన్న వంతెనలు నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

rains at pedavduguru
పెదవడుగూరులో వర్షాలు

By

Published : Sep 30, 2020, 2:34 PM IST

పెదవడుగూరులో కొట్టుకుపోయిన వంతెన

అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురిస్తోంది. ఈ వర్షం ప్రభావంతో పలుచోట్ల వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మండలంలో పలు గ్రామాల్లోని వందల ఎకరాల పంటలు నీట మునిగాయి. పెద్దవడుగూరు పట్టణంలోని పందుల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉద్ధృతిని గమనించకుండా ద్విచక్ర వాహనాలు వాగును దాటేందుకు ప్రయత్నించగా ద్విచక్రవాహనంతో పాటు ఇద్దరు వాహనదారులు వాగులో కొట్టుకుపోయారు. కాసేపటికి ద్విచక్ర వాహనం కొట్టుకుపోయినా వాహనదారులు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు.

వీరన్నపల్లి గ్రామానికి వెళ్లే రెండు రహదారుల్లో ఉన్న వంతెనలు నీటి ఉద్ధృతికి కూలిపోవడంతో వీరన్నపల్లి గ్రామస్తులు బయటకు వెళ్లలేని పరిస్థితి. అదేవిధంగా నీలూరు గ్రామం, తాడిపత్రి మండలం బ్రహ్మణపల్లి వద్ద రహదాలు పూర్తిగా కోతకు గురికావడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

ఇదీ చదవండి: కదులుతున్న కంటైనర్లే టార్గెట్.. రెక్కీ చేస్తే పనైపోయినట్టే!

ABOUT THE AUTHOR

...view details