ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హంద్రీనీవా కాలువ తెగి పంట పొలాలను ముంచెత్తిన నీరు.. - rains at ananthapur district

నైరుతి రుతుపవనాల ప్రభావంతో రెండ్రోజులుగా జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. హంద్రీనీవా కాలువతెగి పంటపొలాలు నీటమునిగాయి. పంట చేలల్లో నీరు చేరింది. అరటి, మామిడి, టమోటా వంటి పంటలకు తీరని నష్టం జరిగింది.

flood to hanrineeva cannal
హంద్రీనీవా కాలువ తెగి పంట పొలాలను ముంచెత్తిన నీరు..

By

Published : Jun 5, 2021, 10:33 AM IST

అనంతపురం జిల్లా మడకశిర మండలం కోతులగుట్టలో హంద్రీనీవా కాలువతెగి పంటపొలాలు నీటమునిగాయి. వర్షాలకు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కాలువ నీళ్లు.. పొలంలోకి చేరి వరి పంట తుడిచిపెట్టుకుపోయిందని రైతు ఆవేదన చెందారు.

మడకశిర మండలంలోని పలు గ్రామాల్లో వాగులు, వంకలకు జలకళ వచ్చింది. హనుమంతునిపల్లిలో భారీ వృక్షం నేలకూలి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ABOUT THE AUTHOR

...view details