ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొంగి ప్రవహిస్తున్న జలాశయాలు.. ఆందోళనలో ప్రజలు

అనంతపురం జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అక్కడి వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుకుంటున్నాయి.

By

Published : Nov 13, 2021, 12:30 PM IST

Updated : Nov 13, 2021, 3:38 PM IST

వర్షాలకు పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు
వర్షాలకు పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు

వాయుగుండం ప్రభావంతో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలోని జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. తనకల్లు మండలంలోని చెన్న రాయస్వామి గుడి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుండంటంతో నీటిని దిగువకు వదులుతున్నారు.

గాండ్లపెంట మండలం వేపలకుంట వద్ద ఉన్న కొండారెడ్డి చెరువు మరవ ఉద్ధృతంగా ప్రవహిస్తూ.. పొలాలపై పారుతోంది. తలుపుల మండలం ఏపులపల్లి వద్ద ఉన్న యరాల వంక పొంగి ప్రవహిస్తుండటంతో ప్రధాన రహదారి తెగిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Last Updated : Nov 13, 2021, 3:38 PM IST

ABOUT THE AUTHOR

...view details