ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిరు జల్లులు.. ఉక్కపోతనుంచి ఉపశమనం పొందిన ప్రజలు

ఉత్తర కోస్తా తీరంపై ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడ్డాయి.

rain in the state
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు

By

Published : Feb 20, 2021, 12:09 PM IST

అనంతపురం జిల్లా గాండ్లపెంటలో మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. సాయంత్రం ఒక్కసారిగా చిరుజల్లులు పడ్డాయి. నిమిషాల వ్యవధిలోనే వీధులన్నీ జలమయమయ్యాయి. కదిరిలో అకస్మాత్తుగా వాన కురిసింది.

ఉపరితల ఆవర్తనం కారణంగా... కర్నూలు జిల్లాలో వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. కర్నూలు నగరాన్ని సైతం చిరుజల్లులు పలకరించాయి. ఉక్కపోత నుంచి జనం ఉపశమనం పొందారు.

ABOUT THE AUTHOR

...view details