అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి ఉల్లి, మొక్కజొన్న, వేరుశనగ, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షానికి దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం పరిహారం అందించాలని రైతులు కోరారు. విశాఖ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో సాగుకు రైతులు సిద్ధమయ్యారు. నర్సీపట్నం డివిజన్ లో విత్తనాలు నాటుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం వర్షాలతో చెరువులు, జలాశయాల్లో నీటిమట్టం పెరుగుతోంది.
కృష్ణా జిల్లా వెల్వడం గ్రామానికి చెందిన మహిళలు వేమిరెడ్డి కృష్ణవేణి, కుక్కల వెంకటేశ్వరమ్మ.. గ్రామ సమీపంలోని పొలాల్లో పశువులు మేపుతున్నారు. ఈ సమయంలో భారీ శబ్దంతో చెట్టుపై పిడుగు పడింది. ఇద్దరు మహిళలు స్పృహ కోల్పోయారు. గమనించిన గ్రామస్థులు బాధితులను మైలవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. షాక్గు గురైన మహిళల్లో ఒకరు కోలుకోగా.. మరొకరికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.