అనంతపురం జిల్లా శెట్టూరు, కుందుర్పి మండల పరిధిలోని పలు గ్రామాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఒక్కసారిగా వర్షం పడటంతో వాతావరణం కొంచెం చల్లబడింది. ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే భారీ వర్షం పడితే వ్యవసాయ పనులకు పనికొచ్చేదని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తేలికపాటి జల్లులు.. చల్లబడ్డ వాతావరణం - అనంతపురం జిల్లాలో వర్షం
అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. శెట్టూరు, కుందుర్పి మండలాల్లో వర్షంపడి వాతావరణం చల్లబడింది.
తేలికపాటి జల్లులు.. చల్లబడ్డ వాతావరణం