అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు జలకళ సంతరించుకున్నాయి . నిన్న ఒక్కరోజే 168 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జనావాసాల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భూగర్భ జలాలు పెరగటంతో రబీ పంటలకు నీరు అందుతుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. బొమ్మనహల్ మండలంలోని చిన్న హగరి వాగు వర్షపు నీటితో పొంగిపొర్లుతోంది.
రాయదుర్గంలో వరుణుడి ప్రతాపం... చెరువులకు జలకళ
అనంతపురం జిల్లా రాయదుర్గంలో భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. రబీ పంటలకు నీరు అందుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాయదుర్గంలో వర్షం