ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అకాల వర్షం.. ఆందోళనలో రైతాంగం

అనంతపురం జిల్లాలో అకాల వర్షం కురిసింది. రైతులు ఆందోళన చెందుతున్నారు. మామిడి, చింత, మిరప, ఉద్వాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నదాతలు వాపోయారు.

rain at rayadurgam in anantapur district
అకాల వర్షంతో అన్నదాతల ఆందోళనలు

By

Published : Feb 19, 2021, 2:40 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో శుక్రవారం వేకువజామున అకాల వర్షం కురిసింది. మామిడి, చింత, మిరప, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వర్షం వల్ల మామిడి పూత, పిందె రాలిన కారణంగా.. దిగుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.

చింతపండు కాపునకు వచ్చిన కారణంగా.. నాణ్యత దెబ్బతినే అవకాశం ఉందని రైతులు వాపోయారు. బ్యాడిగి మిరప సాగు చేసిన రైతులు వర్షం వల్ల రంగుమారి బహిరంగ మార్కెట్లో డిమాండ్ తగ్గే అవకాశాలు ఉన్నాయని అవేదన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details