ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CRASH: ఆగి ఉన్న ఇంజన్​ను ఢీ కొన్న రైలు వ్యాగెన్​.. తప్పిన ప్రమాదం - rail accident

అనంతపురం జిల్లా గుంతకల్​ రైల్వే జంక్షన్​లోని.. తిమ్మనచర్ల రైల్వే స్టేషన్ వద్ద రైలు ఇంజిన్​ను ఓ గూడ్స్​ వ్యాగిన్ ఢీకొంది. ఈ ఘటనలో ట్రాక్​పై ఏ వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి.

rail vagan hit rail engine
ఆగి ఉన్న ఇంజన్​ను ఢీ కొన్న రైలు వ్యాగెన్

By

Published : Jul 4, 2021, 1:15 AM IST

సాధారణంగా రైలు ప్రమాదం అంటే పట్టాలు తప్పడమో, ఇంజన్​లు ఢీ కొనడమో చూస్తుంటాం.. కానీ రైలు ఇంజిన్​ను గూడ్స్ వ్యాగిన్​లు వాటికవే వచ్చి ఢీకొనడం వెరైటీ. అనంతపురం జిల్లా గుంతకల్ జంక్షన్​లోని తిమ్మన చెర్ల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. గుంతకల్ పట్టణంలోని ఆహార గిడ్డంగి సంస్థకు (FCI)లో గూడ్స్ రైలులో వచ్చిన బియ్యాన్ని అన్లోడ్ చేస్తుండగా వ్యాగిన్ వెనక్కు వెళ్లి పోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.

నిన్న మధ్యాహ్నం నెల్లూరు నుండి వచ్చిన గూడ్స్ రైలు FCI లో వాగన్​లను ఆన్​లోడింగ్ కోసం నిలిపి దాని ఇంజిన్ వెనక్కు వెళ్లిపోయింది. ఇలా నిలిపి ఉంచిన వ్యాగిన్లను హమాలి కార్మికులు వారికి అనుకూలంగా వెనక్కు ముందుకు వారే తీసుకుంటూ తీసుకెళ్తారు. అత్యంత బరువైన రైలు బోగీలను మనుషులు తోయడం వింతగా ఉన్నా.. ఇది అక్కడ ఎపుడూ జరిగే తంతే. కానీ ఈ సారి ఇలా తోసినపుడు వెనక్కు వెళ్లిన వాగన్.. ఆగకుండా ఆలాగే ట్రాక్ వెంబడి వెనకకు వెళ్లిపోయి తిమ్మానచర్ల స్టేషన్ సమీపంలో నిలిచి ఉన్న రైలు ఇంజిన్​ను పెద్ద శబ్దంతో ఢీ కొంది. సమయానికి అందరూ అప్రమత్తంగా ఉండటం రోడ్డుపై ఎవరు ఆ సమయంలో ట్రాక్ క్రాస్ చేయకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటనా స్థలం వద్దకు చేరుకున్న రైల్వే అధికారులు పూర్తి వివరాలు సేకరించి ప్రమాదానికి కారణం పై విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details