ETV Bharat / state
'ఆ దేవాలయం కోసమే పీసీసీ పదవికి రఘువీరారెడ్డి రాజీనామా' - pcc raghuveera reddy news in anantha puram
దేవాలయం నిర్మాణం రఘువీరా కుటుంబీకుల కోరిక అని... అందుకోసం సమయాన్ని కేటాయించాలని ఆయన పీసీసీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని మడకశిర మాజీ ఎమ్మెల్యే సుధాకర్ తెలిపారు.


మడకశిర మాజీ ఎమ్మెల్యే సుధాకర్
By
Published : Jan 17, 2020, 9:29 PM IST
| Updated : Jan 17, 2020, 9:38 PM IST
మడకశిర మాజీ ఎమ్మెల్యే సుధాకర్ కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డి...గత ఐదు ఏళ్లుగా పార్టీ బలోపేతానికి ఎంతగానో కష్టపడ్డారని మడకశిర మాజీ ఎమ్మెల్యే సుధాకర్ అన్నారు. దేవాలయం నిర్మాణం రఘువీరా కుటుంబీకుల కోరిక అని... అందుకోసమే ఆయన పీసీసీ పదవికి రాజీనామా చేయాల్సివచ్చిందని సుధాకర్ తెలిపారు. ఆలయ నిర్మాణ పనుల్లో సమయం కేటాయించేందుకు పీసీసీ పదవి రాజీనామా పత్రాన్ని ఆమోదించాలని అధిష్ఠానాన్ని కోరారన్నారు. సోనియా గాంధీ మొదట ఆయన నిర్ణయాన్ని ఒప్పుకోలేదని, ఎట్టేకేలకు తిరిగి ఆమోదించారని మాజీ ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. ప్రస్తుతం పీసీసీ చీఫ్గా నియమితులైన.. సాకె శైలజానాథ్కు అభినందలు తెలిపారు. తామంతా కలిసి పనిచేసేందుకు సుముఖంగా ఉన్నామని తెలిపారు. ఇవీచదవండి
Last Updated : Jan 17, 2020, 9:38 PM IST