అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో.. పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తన పొలంలో గడ్డిని కోయించారు. చుట్టు పక్క ప్రాంతాల పాడి రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు.
గ్రాసం లేక జీవాలను అమ్ముకుంటున్న పరిస్థితుల్లో తన పొలంలోని రాగి గడ్డిని ఇచ్చి పాడి రైతులను కాపాడారంటూ.. రఘువీరాకు పాడి రైతులు కృతజ్ఞతలు చెప్పారు.