అనంతపురం జిల్లా తనకల్లు మండలం కొక్కంటిలోని క్వారీ కార్మికులు తహసీల్దార్‌కు వినతి పత్రం అందించారు. కొక్కంటి వద్ద అడవి ప్రాతంలో బండలు, భవన నిర్మాణానికి ఉపయోగించే రాళ్లను కొడుతూ జీవనం సాగించే తమను కొందరు పనులు చేయొద్దంటూ ఆంక్షలు పెడుతున్నారని కార్మికులు వాపోయారు. కరోనాను సాకుగా చూపి స్థానిక నాయకుల ఆదేశంతో వాలంటీర్లు తమను పని చేసుకోనివ్వడం లేదని తహసీల్దార్ సుబ్బలక్ష్మికి తెలిపారు. కార్మికుల ఉపాధికి ఇబ్బంది తలెత్తకుండా సమస్యను పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఈ మేరకు తహసీల్దార్ హామీ ఇచ్చారు.
మా ఉపాధికి గండి కొడుతున్నారు..ఆదుకోవాలని తహశీల్దార్‌కు వినతి - etv bharat latest updates
అడవిలో బండలు కొట్టుకునే జీవనం సాగించే తమ ఉపాధికి గండి కొట్టేలా కొందరు వ్యవహరిస్తున్నారని అనంతపురం జిల్లా తనకల్లులోని తహసీల్దార్‌కు క్వారీ కార్మికులు వినతి పత్రం అందించారు. సమస్యను పరిశీలించి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హామీ ఇచ్చారు.
'అడవిలో బండలు కొట్టుకుని బ్రతికే మా ఉపాధికి... గంటి కొట్టేలా ఉన్నారే?'