ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక కోసం ఇరువర్గాల ఘర్షణ.. నలుగురికి గాయాలు - ఇరు వర్గాల ఘర్షణలో తొండపాడులో నలుగురికి గాయాలు

ఇసుక విషయంలో రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో నలుగురికి గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడులో ఇరువర్గాలు పరస్పరం కర్రలతో దాడి చేసుకోగా.. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ఇరువురు గుత్తి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.

quarrel between two groups
ఘర్షణలో గాయపడ్డ బాధితులు

By

Published : Dec 9, 2020, 3:32 PM IST

ఘర్షణలో గాయపడ్డ బాధితులు

అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడులో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు గాయాల పాలయ్యారు. ఇసుక వివాదంలో మాట మాట పెరిగి.. రెండు వర్గాలూ కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నాయి. ఈ ఘర్షణలో ఇద్దరు తీవ్రంగా.. మరో ఇరువురు స్వల్పంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని.. మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details