అనంతపురం జిల్లా గుంతకల్లులో అదనపు కలెక్టర్ రామ్మూర్తి ఆకస్మికంగా పర్యటించారు. జిల్లా వ్యాప్తంగా 43 క్వారెంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. వాటిలో ఏర్పాట్లు పరిశీలించేందుకు పర్యటన చేస్తున్నామన్నారు. గుంతకల్లు నియోజకవర్గ పరిధిలో 3 కేంద్రాలు పరిశీలించారు. అందరూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటిస్తూ... కరోనా వైరస్ను తరిమికొట్టాలన్నారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలోని క్వారంటైన్ వార్డును ఆర్డీవో గుణభూషణ్ రెడ్డి పరిశీలించారు. కరోనా అనుమానితుల కోసం 100 పడకలతో గదులను సిద్ధం చేశారు. సామాజిక దూరం, స్వీయ నియంత్రణ పాటించడం ఒక్కటే కరోనా నివారణకు మార్గమని ఆయన అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ మైదానంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కూరగాయల మార్కెట్ ను పరిశీలించి అక్కడి ధరలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో కిలో బెండకాయలు కొనుగోలు చేశారు.