అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి జిల్లా సాధన కమిటీ, సత్యసాయి వాటర్ సప్లై యూనియన్ ఆధ్వర్యంలో పుట్టపర్తి జిల్లా కోసం నిరసన చేపట్టారు. సాయి ఆరామం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నాయకులు అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు. పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీలకు పాలనాపరంగా అనువుగా ఉంటుందని శ్రీ సత్యసాయి జిల్లా సాధన కమిటీ నాయకులు అన్నారు.
'పుట్టపర్తి జిల్లా ఏర్పాటు చేయాలి'
జిల్లాలో ప్రఖ్యాతి చెందిన పుట్టపర్తి కేంద్రంగా రెండవ జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా సాధన కమిటీ, సత్యసాయి వాటర్ సప్లై యూనియన్ ఆధ్వర్యంలో పుట్టపర్తి జిల్లా కోసం నిరసన చేపట్టారు.
పుట్టపర్తి జిల్లా ఏర్పటు చేయాలి
ప్రఖ్యాతిగాంచిన పుట్టపర్తిలో విమానాశ్రయం, రైల్వే స్టేషన్, రాయలసీమలో పెద్దదైన బుక్కపట్నం చెరువు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, యునివర్సిటీ, వందల ఎకరాల ప్రభుత్వ భూమి, జిల్లా ఏర్పాటుకు అనుకూలంగా అన్ని వసతులు ఉన్నాయని అన్నారు. ఈ అంశాలన్నింటితో తహసీల్దార్ గోపాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు.
ఇదీ చదవండి మద్యం దుకాణాన్ని మూసివేయాలని మహిళల ఆందోళన