కరోనా వ్యాప్తి నేపథ్యంలో అనంతపురం జిల్లా పుట్టపర్తిలో పూర్తి అప్రమత్తంగా ఉన్నామని శిక్షణా కలెక్టర్ జాహ్నవి స్పష్టం చేశారు. కదిరిలో విదేశాల నుంచి తిరిగి వచ్చినవారు, ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లి వచ్చిన వారి వివరాలు పూర్తిగా సేకరించామన్నారు. ప్రత్యేకించి విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్‌లో ఉంచామని చెప్పారు. నిత్యావసర వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జాహ్నవి హెచ్చరించారు.
కరోనా వ్యాప్తి దృష్ట్యా పుట్టపర్తిలో అప్రమత్తం - కరోనా వ్యాప్తి దృష్ట్యా పుట్టపర్తిలో అప్రమత్తం
కరోనా వ్యాప్తి దృష్ట్యా పూర్తి అప్రమత్తంగా ఉన్నామని శిక్షణా కలెక్టర్ జాహ్నవి తెలిపారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారిని క్వారంటైన్‌లో ఉంచామన్నారు. నిత్యం వైద్యపరీక్షలు నిర్వహిస్తూ జాగ్రత్త వహిస్తున్నామని తెలిపారు.
puttaparthi-alert-in-ananthapuram